నాగారం ఎస్ఐగా చిరంజీవి బాధ్యతలు స్వీకారం

నాగారం, నవంబర్ 26 (విశ్వం న్యూస్) : నాగారం పోలీస్‌స్టేషన్‌కి నియమితులైన ఎస్.చిరంజీవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ టూ టౌన్లో ఎస్ఐగా సేవలందించిన ఆయన, బదిలీపై నాగారం కు వచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎస్ఐ చిరంజీవి తెలిపారు.