Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

ఎమ్మెల్యే సాయన్నమృతి పట్ల సిఎం కేసీఆర్ సంతాపం

ఎమ్మెల్యే సాయన్నమృతి పట్ల సిఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాదపడుతున్న సాయన్న చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల సిఎం విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, పలు పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజా సేవను తనతో వారికున్న అనుబంధాన్ని, సిఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *