గురువారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన

గురువారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన

  • అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారు

వరంగల్, మార్చి 22 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు రేపు అనగా 23-03-2023, గురువారం రోజున ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం నుండి హెలి క్యాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, రెడ్డికుంట తండా కు చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారన్నారు. అక్కడ బాధితులతో మాట్లాడుతారు. రెడ్డికుంట తండా నుండి హెలీ క్యాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, అడవి రంగాపురం కు చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. బాధితులను ఓదారుస్తారు.అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, zp చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *