సీఎం సాబ్.. పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి

  • తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : ఎన్నో సంవత్సరాల కల నిజం కావాలని ఎంతో ఉద్యమించి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాడాలని అప్పటి ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ముందు వరుసలో ఉండి ఎంతో పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పుడు ఏర్పాటైన టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తుందని అనుకొని ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో సంతోషపడ్డారు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉండుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకే మొండి చేయి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కే పేరు దక్కిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆరోపించారు.

కొంతమంది స్వార్థపరులను, సంఘ నాయకులను తన గుప్పెట్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కన్నీరు పెట్టించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి దక్కిందని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వారి స్వార్థం కొరకు పదవులకు ఆశపడి ఉద్యోగులందరినీ ఇబ్బందుల పాలు చేసిన ఆ నాయకుల పేర్లు చెప్తానే ప్రభుత్వ ఉద్యోగులను ఆవేశముగా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వములో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పిల్లల పెండ్లి కోసం దాచుకున్న జిపిఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్, ఏపీ జిఎల్ బి లోన్ హౌసింగ్ లోన్, చిల్డ్రన్ కన్సిజన్ బిల్, రిటైర్డ్ అయిన ఉద్యోగుస్తులకు గ్రాట్యుటిటీ, పెన్షన్ కు సంబంధించిన సప్లమెంటరీ బిల్లు, మెడికల్ బిల్లు, ఇలాంటి ఎన్నో రకాల బిల్లులను గత టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దాదాపు సంవత్సరము నుండి ఈ యొక్క బిల్లులు మంజూరు కాకుండా జిల్లా ట్రెజరీ సబ్ ట్రెజరీ కార్యాలయంలో మంజూరు చేసి టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి బిల్లులకు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు మంజూరి కాలేదు.

ఇప్పటికీ తిరిగి అదే కార్యాలయాలకు ఆ యొక్క బిల్లులు కార్యాలయంలో ఉన్నాయి అలాంటి ఘనకార్యం చేసిన ఘనత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కే దక్కింది ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీ అని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది అలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని తెలియజేస్తూ ప్రజలందరూ కలిసి ఒక తీర్పు ఇవ్వటం జరిగింది ఆ తీర్పు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు అని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘ నాయకులను ప్రక్కకు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులందరినీ వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సంక్షేమం కొరకు ఉద్యోగుల కుటుంబాల మేలుకొరకు ఇప్పటి డైనమిక్ టైగర్ తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని అప్పటి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల లకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి చొరవ తీసుకొని ఈ ఒక్క బిల్లులను మంజూరు చేయించడానికి ప్రయత్నం చేయాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *