మా అబ్బాయి పెళ్లికి రండి

హైదరాబాద్, జూలై 30 (విశ్వం న్యూస్) : భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లిన బ్రహ్మానందం.. త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.

బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు వివాహ పత్రికను కేసీఆర్-శోభ దంపతులకు అందజేశారు. తన కుమారుడు పెళ్లి హైదరాబాద్‌లోనే జరుగుతుందని.. తప్పకుండా హాజరుకావాలని కేసీఆర్‌ను బ్రహ్మానందం కోరారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.