బోడుప్పల్ లో శ్రీ మల్లికార్జున కళ్యాణ మహోత్సవ జాతర ప్రారంభం
బోడుప్పల్ లో శ్రీ మల్లికార్జున కళ్యాణ మహోత్సవ జాతర ప్రారంభం

మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహా జాతర
బోడుప్పల్, పిబ్రవరి 13 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ మల్లాపూర్ మెయిన్ రోడ్ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని సోమవారం నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం అదేవిధంగా స్వామివారికి పెద్దపట్నం తదితర కార్యక్రమాలు పురస్కరించుకొని పట్టు వస్త్ర తలంబ్రాలు తదితర ప్రాథమిక ప్రత్యేక పూజ కార్యక్రమాలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవలయ కమిటీ సభ్యులు రాసాల నర్సింగరావు, జెనిగ బంగారు, కోతుల మల్లేష్, తోటకూర రవీందర్ యాదవ్, రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, జె శివ యాదవ్, సత్యమూర్తి, ఆనంద్, మల్లేష్, శ్రావణ్ యాదవ్, అయ్యగార్లు మురళి యాదవ సంఘం నాయకులు వారి కుటుంబ సభ్యులు మహిళలు యువత తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించారు.

