
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) :ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి కేసీఆర్ సభపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందని మంత్రి హరీష్ రావు అన్నారు. “కేసీఆర్ ఏం మాట్లాడతారో తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టెన్షన్‌లో ఉన్నారు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
“కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది,” అంటూ హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంచారని, రాష్ట్ర అభివృద్ధి పథాన్ని కొనసాగించేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు స్పష్టం చేశారు.
- బీఆర్‌ఎస్‌లో భిన్నాభిప్రాయాల్లేవు – మళ్లీ సీఎం కేసీఆర్‌నే: హరీశ్ రావు
బీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే కొనసాగుతారని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పష్టం చేశారు.
కేటీఆర్, కవిత మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం గిట్టని వారి ప్రయత్నమని ఆయన కొట్టిపారేశారు. “కేసీఆర్ మా నాయకుడు. ఆయన తీసుకునే ఏ నిర్ణయమైనా మేము శిరసు వంచి అనుసరిస్తాం,” అన్నారు. - సీఎం రేవంత్ రెడ్డి మాటతీరు, తిట్లదండకం వల్ల ఆయన తన పార్టీ నేతల మద్దతును కోల్పోయారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. “మాలో ఎవరికి అహంకారం లేదు. కొందరి ప్రశ్నించే తీరు వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడింది. ప్రజలు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు. గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చారు,” అన్నారు.
- “కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్? అది సోషల్ మీడియా సృష్టించిన దుష్ప్రచారం మాత్రమే” అని హరీశ్ రావు స్పష్టం చేశారు. గతంలో కూడా బీఆర్‌ఎస్‌పై ఇలాంటి దుష్ప్రచారమే జరిగినట్లు గుర్తుచేశారు.
కేసీఆర్ రజతోత్సవ సభపై హరీశ్ రావు స్పందిస్తూ, “27వతేదీ జరిగే సభలో కేసీఆర్ ఏమి మాట్లాడతారో తెలంగాణ మొత్తం ఎదురు చూస్తోంది. ముందే లీకులు ఉండవు. కోట్లాది ప్రజలు ఆ రోజు కళ్లతో చూస్తారు,” అన్నారు. - “కేసీఆర్ ఇచ్చే బాధ్యత ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. నేను కార్యకర్తను, ఉద్యమకారుడిని. ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తాను,” అన్నారు హరీశ్ రావు.