పశు సంక్రాంత్రి జాతరలో
కాంగ్రెస్ నేతల సందడి

గండిపేట్, జనవరి 23, 2026 (విశ్వం న్యూస్) : గండిపేట్ నార్సింగిలో గురువారం పశు సంక్రాంత్రి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ డప్పు నవీన్ కుమార్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు అంకం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ భోగాల శ్రీనివాస్, సూర్య రిపోర్టర్ గోపాల్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ కోట వేణు గౌడ్, ఏఎంసి డైరెక్టర్ల ఆధ్వర్యంలో నాయకులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. పశు సంక్రాంత్రి వేడుకలను పూలపల్లి కృష్ణారెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆనందంగా తిలకిస్తూ, ప్రజలతో కలిసిమెలిసి మాట్లాడారు. జాతర సందర్శనతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.