ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు కాంగ్రెస్ నేతల వినతి

ఇందిరమ్మ ఇండ్ల
కేటాయింపునకు
కాంగ్రెస్ నేతల వినతి

హైదరాబాద్, జనవరి 23, 2026 (విశ్వం న్యూస్) :  హైదర్ షాకోట్ డివిజన్ 123 పరిధిలోని పిరంచెరువు, హైదర్ షాకోట్, గంధం గూడ, బైరాగిగూడ గ్రామాల్లో నివసిస్తున్న ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని గండిపేట్ మండల్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని బండ్లగూడ జాగిర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు డప్పు నవీన్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు అంకం శ్రీనివాస్, సీనియర్ నాయకుడు భోగాల శ్రీనివాస్ కలిసి సమర్పించారు.

అదేవిధంగా బైరాగిగూడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రజా భవనానికి స్థలం కేటాయించాలని కూడా వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో గంధం గూడ గ్రామంలో శిథిలావస్థకు చేరిన జెఎన్‌యూఆర్‌ఆర్‌ఎం ఇండ్లను పునఃనిర్మించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లు గత పది సంవత్సరాలుగా మరమ్మత్తులు లేకపోవడంతో కూలిపోయే స్థితికి చేరాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వారు విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్ల స్థానంలోనే అక్కడ నివసిస్తున్న పేదలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో కొత్త ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి అందజేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *