కేసీఆర్ బస్సు యాత్ర – 4 వ రోజు –
నాగర్ కర్నూల్ రోడ్డు షో

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విశ్వం న్యూస్) : శుక్రవారం 3 వ రోజు బస్సుయాత్ర రోడ్డు షో అనంతరం, మహబూబ్ నగర్ లో బస చేసిన కేసీఆర్, శనివారం నాగర్ కర్నూల్ రోడ్డు షో లో పాల్గొన్నారు. యాత్రలో పలు వర్గాల ప్రజలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. హారతులతో పూలు జల్లి ఘన స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు :


- నేడు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం…తెలంగాణ రాష్ట్రానికి శంఖుస్థాపన జరిగిన రోజు.
- బిఆర్ఎస్ పుట్టింది పెరిగింది మహాసముద్రమైంది
- ఉద్యమకాలంలో చాలాసార్లు నాగర్ కర్నూల్ కు వచ్చిన
- మహబూబ్ నగర్ ఎంపీ గా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది
- కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం
- అన్ని వర్గాల ప్రజలను గులాబీ జెండా తన నీడన కోడిపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకుంది
- రైతుబంధు వచ్చిందా
- 2500 వచ్చినయా
- రుణ మాఫీ అయిందా
- స్కూటీ వచ్చిందా
- బోనస్ వచ్చిందా
- సీఎం విను నేను జనం నడుమనుంచి మాట్లాడుతున్నా
- పండించిన ధాన్యాన్ని కూడా కొనలేకపోతున్నారు
- రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
- కేసీఆర్ చేసి తయారు పెట్టిందే కదా గడ్డపార పెట్టి కొత్తగా తొవ్వేదిలేదు
- నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయింది ఏంది సంగతి అని అడిగితే రోజు 10 సార్ల పోతున్నది అని చెప్పిండ్రు
- ఐదు ఎకరాలకు మాత్రమే ఇస్తానంటే మరి ఆరో ఎకకరమోడు ఎటుపోవాలే
- రైతుబంధు టింగు టింగు మని మెసేజ్ లోచ్చేటియి మన ప్రభుత్వంలో
- కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలకు పంచాయతి పడ్డది.. మరి మీ తరఫున కొట్లాడే పంచాతీ పెద్దమనిషి పంజు ఎవరు మరి .?
- కేసీఆర్ కేసీఆర్ జనం స్పందన
- మరి మీరు నాకు బలం
- ఇస్తేనే కొట్లాడగలుగుత
- ఆర్ఎస్ ప్రవీణ్ ను గెలిపిస్తేనే మీరు నాకు బలాన్ని ఇచ్చినట్టు
- బీజేపీ పార్టీ వందలాది వాగ్దానాలు ఇచ్చింది ఒకటన్నా అమలు చేసిండా మోడీ
- బేటి పడావో అయిందా
- మరి ఎందుకెయ్యాలి బిజెపి కి ఓటు.?
- చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ ఇయ్యాలే మెడికల్ కాలేజీ ఇయ్యలే పాలమూరు ఎత్తిపోతల కు జాతీయ హోదా ఇయ్యలే
- నా తలతెగిపడ్డా మోటార్లకు మీటర్లను పెట్టనియ్య అని చెప్పిన మోడీకి
- మనం ఉన్మాదంలాపడి పోవద్దు
- మీ మీ గ్రామాల్లో చర్చించండి
- మనకోసం పని చేసే పార్టీని గెలిపించుకోవాలి
- బీజేపీ మనకు అక్కరకు రాని చుట్గం
- తెలంగాణ ఎన్నికలకోసం గుజరాత్ ముఖ్యమంత్రి ఇక్కడికి రవాల్నా .?
- గురుకుల విద్యను తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలి
- ప్రవీణ్ ఆశా మాశి వ్యక్తి కాదు. అసంటోళ్లు మల్లా దొరుకరు
- అల్లా కే ఘర్ మే దేర్ హోగా మగర్ అందేఆర్ నహీ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది
- ముస్లిం సమాజానికి యువత కు వినతి ఎట్టిపరిస్థిలో బిజెపి గెలవకూడదు. బిఆర్ ఎస్ ను గెలిపించాలి.
- మహబూబ్ నగర్ నగర్ కర్నూలు లో మనమే గెలుస్తున్నాం
- కేసీఆర్ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంట పేగులు తీసి మెదలేసుకుంటా ముడ్డి మీది శెడ్డి గుంజుకుంట అంటాండు ఇది పద్ధతేనా.?
- మల్ల మనదే ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ పోయినా అపూర్వ స్పందన వస్తున్నది. గుమ్మడికాయలతో పూలతో స్వాగతం పలుకుతున్నారు
- తెలంగాణ సమాజం కాంగ్రెస్ మీద భగ్గుమంటున్నది.
- జై తెలంగాణ
- కారు గుర్తుకే మన ఓటు
