కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
చొరవతో తీరిన కరెంట్ కష్టాలు

బండ్లగూడ జాగీర్, జూన్ 23 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటో వార్డులో ఎన్నో రోజులుగా విద్యానగర్లో కరెంటులో లో వోల్టేజ్ విద్యుత్ సరఫరా, స్తంభాలు దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడుతుండేవారు. గత మూడు, నాలుగు కౌన్సిల్ మీటింగ్‌లో ప్రస్తావించడంతో కరెంట్ అధికారులు విద్యానగర్ కు కరెంటు సమస్యలను తీర్చడానికి ముందుకు వచ్చారు. ఈ పరిష్కారంతో కరెంటు 24 గంటలు రావడంతో కేసీఆర్ కి, ఎమ్మెల్యేకి, ఎంపీకి, మేయర్ కి, డిప్యూటీ మేయర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్ట సాయిబాబా, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తుల నరేందర్, దస్తయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.