ఘనంగా గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం
ఘనంగా గోల్కొండ
జగదాంబ మహంకాళి
అమ్మవారికి మొదటి బోనం

హైదరాబాద్, జూన్ 23 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి మొదటి వారం బోనాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు తలారి ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి గణేష్, భోగాల శ్రీనివాస్, జి బాబు, ఆర్య, శ్రీనివాస్, శ్రీకాంత్ చారి, లక్ష్మణ్ యాదవ్, మురళి, తలారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

