- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి కు తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విశ్వం న్యూస్) : పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు, సంబంధించిన డీ ఏ లను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ లకు ఒక రిప్రజెంటేషన్ పంపించినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.
మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత 20 22 జూలై 20 23 జనవరి జూలై నెలల డి ఎ లు బకాయి ఉండగా కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ప్రకటించటం ఉందని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేటు చేయకుండా పెండింగ్ లో ఉన్న డిఎ, అన్ని సప్లమెంటరీ బిల్లులు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లు, జిపిఎఫ్ పార్ట్ ఫైనల్, ఫైనల్ పేమెంట్ లోను సకలములో వచ్చినట్లు వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలపై తగు నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పెడచెవి పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసని పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా వెంటనే స్పందించి తగు నిర్ణయాలు తీసుకొని ఒక నిర్దిష్టం కాలం పరిమితిలో ఇచ్చేటట్లు చూడాలని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ మంత్రులకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు పై దృష్టి సారించి సగటు ఉద్యోగికి లాభం చేకూరేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి డి ఏ మెడికల్ రియంబర్స్ మెంట్ వంటివి దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఎస్టీలు పి ఏ ఓ ట్రెజరీ డిపార్ట్మెంట్లో బిల్లులు పాసు చేసిన ఈ కుబేరంలో పెండింగ్ ఉండటంతో సకాలంలో బిల్లులు రాక ఉద్యోగులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఒకటో తేదీన వేతనాలు ఇచ్చేలా ఎలాగైతే చర్యలు తీసుకుందో అలాగే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పాస్ చేసేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని కోరారు.