తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తిరుమల, జనవరి 2 (విశ్వం న్యూస్) : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.