ధర్మపురిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలో మంత్రి ఈశ్వర్

ధర్మపురి, జనవరి 2 (విశ్వం న్యూస్) : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున ఉత్తర ద్వారా మంత్రి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
లబ్ధిదారులకు చెక్కులు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కప్పారావు పేట నుండి శాఖపూర్ వరకు 1 కోటి 80 లక్షల వ్యయం తో రోడ్డు విస్తరణ మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం 19 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.5,75,000/- విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు
