దశాబ్ది ఉత్సవలను అంగరంగ వైభవంగా
నిర్వహించాలి:మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, మే 27 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాల గురించి కలెక్టర్ అమొయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రోజులు జరిగే శతాబ్ది ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు రూ.1 కోటి 80 లక్షల నిధులు కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, సుమన్ నాయక్, చీరాల నర్సింహా, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, కొత్త చక్రపాణి గౌడ్, కృపాసాగర్, జక్కల రాములు, కో అప్షన్ సభ్యులు రంగా భ్రమ్మన్న తదితరులు పాల్గొన్నారు.