ఆవిష్కృతమైనా అద్భుత ఘట్టం.. ఎస్సారెస్పీనీ ముద్దాడిన కాళేశ్వరం జలాలు

బాల్కొండ:ఎస్సారెస్పీనీ
ముద్దాడిన కాళేశ్వరం జలాలు

  • సీఎం కేసీఆర్ గారి సంకల్పం తో నెరవేరిన రైతుల కల
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మొనగాడు కేసిఆర్- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, జూలై 7 (విశ్వం న్యూస్) : బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంపు హౌజ్ నుండి ఎస్సారెస్పీ జలాశయంలోకి వరద కాలువ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్ బాజీ రెడ్డి గోవర్ధన్ లతో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి విడుదల చేసి కాళేశ్వరం జలాలను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రోజుకు 0.5 టిఎంసి చొప్పున నీటిని 60 రోజుల పాటు 30 టిఎంసిలు ఎస్సారెస్పీ లో నింపుకోవాలి అని కేసిఆర్ నిర్ణయించి నీటి కేటాయింపులు పై లెక్కలు వేస్తున్న సందర్భంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు 5టిఎంసిలు అడిగారు. ఆ ఏర్పాట్లు చూడాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. లక్ష్మిపుత్రుడు పోచారం శ్రీనివాస రెడ్డి గారంటే కేసిఆర్ గారికి అంత ఇష్టమని ఆయన అక్కడ లేకున్నా ఆయన చెప్పిన విషయం ముఖ్యమంత్రి గారికి ఆ సమస్య గుర్తుందనీ, ఎవరిని కేసిఆర్ గారు మర్చిపోరని, ఆయనకు అన్ని తెల్సు అని మంత్రి వేముల ఈ సందర్బంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మేల్యేలు జీవన్ రెడ్డి, రేఖా నాయక్,విఠల్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు,కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మహిళా సాధికారత అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, మాజి ఎమ్మెల్సీలు వి.జి గౌడ్,రాజేశ్వర రావు, నాయకులు డా.మధు శేఖర్, కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *