Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుతెలంగాణవరంగల్

వరంగల్:భద్రకాళి అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు

  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
  • ఆలయం అంతా భద్రత సిబ్బందే..

వరంగల్, జూలై 8 (విశ్వం న్యూస్) : ప్రధాని నరేంద్ర మోడీ భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. మామూనురు ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీఎంకు వరంగల్, హన్మకొండ కలెక్టర్లతో పాటు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా భద్రకాళి ఆలయానికి చేరుకోగా.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *