టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణ
టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విశ్వం న్యూస్) : టిఎన్జిఒస్ యూనియన్ వరంగల్ జిల్లా డైరీ ఆవిష్కరణ టీఎన్జీవోస్ భవన్ హైదరాబాద్ లో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ పాల్గొని ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే విధంగా 1 శాతం మూలవేతనంతో నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రాబోవు రోజులలో ఉద్యోగుల అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల కోసం ఆర్నిశలు కృషి చేస్తున్న కేంద్ర సంఘ అధ్యక్షులు రాజేందర్ మరియు ప్రధాన కార్యదర్శి ప్రతాప్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకండి ప్రతాప్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవోస్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజ వేణుగోపాల్, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రవణ్, మెడికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షులు హేమ నాయక్, ఉపాధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, మురళీధర్ రెడ్డి, సహ కార్యదర్శులు దుర్గారావు ,రామకృష్ణ, వంశీ, చిరంజీవి, నాయకులు, రవికుమార్, రవీందర్, సురేష్ రెడ్డి, శ్యామ్ సుందర్, కిరణ్ నాగేశ్వరరావు , గణేష్, మురళి, గంగాధర్ భాస్కర్, కిషన్ నాయక్, ప్రశాంత్, కుమార్ క్రాంతి, శంకేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
