పరిశీలించిన
నామినేషన్ కేంద్రాన్ని
పరిశీలించిన జిల్లా కలెక్టర్

నాగారం, నవంబర్ 29 (విశ్వం న్యూస్) : నాగారం మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకుని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించాలని సూచించారు.

ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు ఎమ్మార్వో హరికిషోర్ శర్మ, ఎంపీడీవో బీమ్ సింగ్, ఆర్ఐ బాబా, ఎంపీఓ సుమలత తదితరులు పాల్గొన్నారు.