దీక్షా దివస్: తెలంగాణ ఆత్మగౌరవ
పోరాటానికి ఆద్యుడు కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 29 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి శ్రీకారం చుట్టిన మహా దీక్షను స్మరించుకుంటూ, తెలంగాణ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మార్గం సుగమం చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపితగా అభివర్ణించబడే శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి దాసోజు శ్రవణ్ వినమ్రపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
అణగారిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో, “చచ్చుడో – తెలంగాణ వచ్చుడో” అనే నిబద్ధతతో, 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకూ 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించిన కేసీఆర్ గారి త్యాగమే తెలంగాణ ఏర్పాటుకు కారణమైందని ఆయన పేర్కొన్నారు.
శ్రవణ్ మాట్లాడుతూ—
కేసీఆర్ గారి దీక్ష లేకపోతే తెలంగాణ రాదని
స్వపరిపాలన, స్వాభిమానం కలుగేదే కాదని
ఈరోజు కనిపిస్తున్న సమగ్ర అభివృద్ధి అసాధ్యమయ్యేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలో కేసీఆర్ చేసిన ఆత్మత్యాగం “వధ్యశిలపై తల పెట్టిన నిర్భయ సంకల్పం”గా నిలిచిపోయిందని ఆయన అన్నారు. ఆ దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెనక్కి తగ్గేలా చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడేలా చేసిన చారిత్రాత్మక మైలురాయిగా గుర్తించారు.
దీక్షాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భావానికి మార్గదర్శకుడైన కే.సీ.ఆర్ గారికి దాసోజు శ్రవణ్ వినమ్రపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.