డీకే శివకుమార్, కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులు:దాసోజు శ్రవణ్

డీకే శివకుమార్, కాంగ్రెస్
ముమ్మాటికీ తెలంగాణ
ద్రోహులు:దాసోజు శ్రవణ్

  • తెలంగాణ పరిశ్రమలని దొడ్డిదారిన తరలించడానికి ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్, కాంగ్రెస్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులు. ఈ దుర్మార్గం పై రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి : బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్, నవంబర్ 04 (విశ్వం న్యూస్): 24 గంటల కరెంట్ సరఫరా, సింగెల్ విండో పాలసీ టిఎస్ ఐ పాస్, అద్భుతమైన రాయితీలు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ మినిస్టర్ కేటీఆర్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కేసీఆర్ గవర్నెన్స్, అద్భుతమైన లా అండ్ ఆర్డర్ తో హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమని పెద్దపెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయ్. దిన్ని చూసి ఓర్వలేని డికే శివకుమార్ ఇక్కడి పరిశ్రమలని తరలించే దుర్మార్గానికి పాల్పడుతున్నారు.

*పాక్స్ కాన్ కంపెనీ ఇక్కడికి రావడానికి దాదాపు ఐదేళ్ళ పాటు కేటీఆర్ గారి నేతృత్వంలో ఆయన, ఆయనటీం సభ్యులు అలుపెరుగని ప్రయత్నాలు చేసి మూడువేల ఐదు వందల కోట్ల పెట్టుబడి, దీర్గాకాలికంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ సంకుస్థాపన జరిగిన పరిశ్రమని దొడ్డిదారిలో బెంగళూరు తరలించడానికి ప్రత్నిస్తున్న కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ చేస్తున్న ఈ ద్రోహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. .

*పక్క రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి మంచి పధకాలు అమలు చేస్తాం, మంచి చేస్తామని చెబుతూనే మరోపక్క ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ లోవున్న కంపెనీలని బెంగళూరు తరలించే కుట్రతో లేఖలు ఎందుకు రాస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి.

*కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ కలసి నేడు ఇండస్ట్రీ పోచింగ్ చేస్తున్నాయి. ఇంత నీచానికి ఎందుకు దిగాజారుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విజ్ఞత, వెన్నుముక లేని నాయకులని మరోసారి నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ లాంటి మోసగాళ్ళ పట్ల తెలంగాణ సమాజం జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి మోసగాళ్ళని గల్లాపట్టి నిలదీసి అడగాలి.

*2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, యాభై లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ ని బిజెపి అమలు చేయలేదు. ఐటీఐఆర్ ని బిజెపి తన్నుకుపొతే ఇవాళ ఫాక్స్ కాన్ కంపెనీని కాంగ్రెస్ వాళ్ళు తన్నుకుపోవాడని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులకు కర్రుకాల్చి వాత పెట్టాలా వద్దా అనేది తెలంగాణ సమాజం అలోచించుకోవాలి.

‘’ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నేతృత్వంలో గత పదేళ్ళుగా తెలంగాణ పెట్టుబడులకు తలమానికంగా ఐటీ పరిశ్రమకు పెట్టని కోటగా దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. ఇలాంటి నేపధ్యంలో కర్ణాటక నుంచి ఇక్కడి ఎన్నికల ప్రచారంకు వస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజలకుబూటకపు హామీలు ఇస్తూ మరో పక్క తెలంగాణ హితానికి వ్యతిరేకంగా, రాష్ట్ర భవిష్యత్ ని కాలరాసే విధంగా, తెలంగాణ యువత జీవితాలతో చెలగాటం ఆడే విధంగా ఇక్కడ కంపెనీలని బెంగళూరుకు తరలించే విధంగా ఎరలు వేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఎముటుంది? ఇక్కడికి ప్రచారంకు వచ్చిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ఈ దుర్మార్గానికి, దుస్సాహసానికి పాల్పడుతున్నారు. ఇక్కడి పరిశ్రమలని దొడ్డిదారిన తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ద్రోహం ఇంకొకటి వుంటుందా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్.

ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా. శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజేపీల కారణంగా కార్ణాటక అతలాకుతలంగా మారింది. రోడ్లు లేవు. ఎటు చూసినా కాలుష్యం, ట్రాఫిక్. ఒకప్పుడు కర్నాటక సిటీ అఫ్ గార్డెన్స్ ఇప్పుడు సిటీ అఫ్ గార్బేజ్. అన్ని రకాలుగా బెంగళూరు అధోగతి పాలైన నేపధ్యంలో నేడు హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమని పెద్దపెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయ్. దీనికి ప్రధాన కారణం.. కేసీఆర్ గారి నేతృత్వంలో 24 గంటల కరెంట్ సరఫరా, సింగెల్ విండో పాలసీ టిఎస్ ఐ పాస్, అద్భుతమైన రాయితీలు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ మినిస్టర్ కేటీఆర్, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కేసీఆర్ గవర్నెన్స్. దీనికితోడు గ్లోబల్ స్థాయి వసతులు, అద్భుతంగా అమలౌతున్న లా అండ్ ఆర్డర్. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతునారు. రజినీకాంత్ లాంటి నటులు, ఫాక్స్ కాన్ చైర్మన్ తో పాటు అనేకమంది ప్రముఖులు ఇది న్యూయార్క్ లావుందని కితాబులిస్తున్నారు. దిన్ని చూసి ఓర్వలేని డికే శివకుమార్ ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతునారు’’ అని పేర్కొన్నారు.

‘’ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. అయితే ఒకపక్క మంచి పధకాలు అమలు చేస్తాం, మంచి చేస్తామని చెబుతూనే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? హైదరాబ్ లోవున్న కంపెనీలని బెంగళూరు తరలించే కుట్రలు లేఖలు ఎందుకు రాస్తున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి’’ అని కోరారు

‘’ఫాక్స్ కాన్ కంపెనీకి లేఖరాశారని సామాజిక మాధ్యమాల్లో చుస్తున్నాం. ఆ కంపెనీ ఇక్కడికి రావడానికి దాదాపు ఐదేళ్ళ పాటు కేటీఆర్ గారి నేతృత్వం ఆయన, ఆయనటీం సభ్యులు అలుపెరుగని ప్రయత్నాలు చేసి మూడువేల ఐదు వందల కోట్ల పెట్టుబడి, దీర్గాకాలికంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చారు. సంకుస్థాపన జరిగింది అద్భుతంగా పని జరుగుతుందని సంతోషపడుతుంటే దొడ్డిదారిలో కాంగ్రెస్ నాయకుడు డికే శివకుమార్ చేస్తున్న ఈ ద్రోహాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ముమ్మాటికీ మోసం. చేతనైతే హైదరాబాద్ కి సమానంగా బెంగళూరుని అభివృద్ధి చేసుకోండి. అంతేగానీ ఇక్కడ ప్రారంభమైన కంపెనీలని ప్రేరేపించే విధంగా లేఖలు రాయడం ఎందుకు? ఇది అన్యాయం కాదా ? ఇదెక్కడిన్యాయం రాహుల్ గాంధీ గారు ? ఇదెక్కడి న్యాయం డీకే శివకుమార్? ఇదెక్కడి న్యాయం రేవంత్ రెడ్డి? కర్ణాటక కోసం పని చస్తున్నారా ? లేదా తెలంగాణ కోసం పని చేస్తున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ కోసం పని చేసే నాయకులైతే ఈ కథనాలపై స్పందించి వుండాలి. ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు ? తెలంగాణ పరిశ్రమలని తరలించే కుట్రలు జరుగుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి పెదవి విప్పడం లేదు ? తెలంగాణ సమాజం దీనిపై అలోచించాలి’’ అని కోరారు.

కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ కలసి నేడు ఇండస్ట్రీ పోచింగ్ చేస్తున్నాయి. ఇంత నీచానికి ఎందుకు దిగాజారుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విజ్ఞత, వెన్నుముక లేని నాయకులని మరోసారి నిరూపించుకున్నారు. వెన్నుముక లేని కాంగ్రెస్ నాయకుల వలన తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేశాం. కొట్లాదడి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, పరిపాలించుకుంటున్నాం. నేడు మళ్ళీ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడి కంపెనీలని దోచుకువెళ్ళాలని కుట్ర చేస్తుంటే.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వున్నారు. కాంగ్రెస్ బానిసత్వపు నాయకుల వలన తెలంగాణకు న్యాయం జరగదని తెలంగాణ సమాజం, యువత గుర్తుంచాలి’’ అని కోరారు.

2014లో ఐటీ ఎగుమతులు 56వేల కోట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత కుదురుకోవడానికి ఏడాది కాలం పట్టింది. తర్వాత కరోనా కారణంగా మరో రెండేళ్ళు కొన్ని పనులకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ కేవలం ఆరేళ్ళలోనే కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నేతృత్వంలో 2 లక్షల 41 వేల 275 కోట్ల ఐటీ ఎగుమతులు సాధించాం. గతంలో మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు వుంటే ఈ పదేళ్ళలో తొమ్మిది లక్షల ఐదు వేల ఉద్యోగాలకు చేరాం. టీఎస్ ఐ పాస్ ద్వారా నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వం, ప్రభుత్వేతర కలిపి లక్షా అరవై వేల ఉద్యోగాలు భర్తీ జరిగింది. ఇంత అద్భుతంగా యువతని ఆదుకోవాలి ప్రయత్నం చేస్తుంటే సందడిలో సడేమియాలా ప్రచారంకు వచ్చి తెలంగాణ పరిశ్రమలకు గండికొట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ళ పట్ల తెలంగాణ సమాజం జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి మోసగాళ్ళని గల్లాపట్టి నిలదీసి అడగాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *