సికింద్రాబాద్ జోలికి రావొద్దు! – ఇది చరిత్రను ఖూనీ చేయడమే: డా. శ్రవణ్ దాసోజు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్

సికింద్రాబాద్, జనవరి 5 (విశ్వం న్యూస్) : సికింద్రాబాద్ అంటే కేవలం ఒక పిన్‌కోడ్ కాదు… అది ఒక బ్యూరోక్రాటిక్ బ్లాక్ కూడా కాదు. పరిపాలనా మ్యాప్‌లో గీత గీసి మార్చేయగల ప్రాంతం అసలే కాదు. ఇది 200 ఏళ్ల సజీవ చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, తరతరాల జ్ఞాపకాల సమాహారం. ఎన్నో ఆధునిక నగరాలకు ముందే తనకంటూ ఒక విశిష్టమైన పౌర ఆత్మను (Civic Soul) సంతరించుకున్న నగరం సికింద్రాబాద్.

1806లో పురుడుపోసుకున్న సికింద్రాబాద్, తనదైన గుర్తింపుతో, ప్రత్యేక సంస్కృతితో ఎదిగింది. హైదరాబాద్‌కు ‘ట్విన్ సిటీ’గా గర్వంగా భుజం భుజం కలిపి నిలిచింది. ఇప్పుడు “పునర్వ్యవస్థీకరణ” అనే ముసుగు}{!లో ఆ పేరును తుడిచివేయాలని చూడటం లేదా వేరే పరిపాలనా యూనిట్‌లో కలిపేయడం సాంస్కృతిక విధ్వంసంతో సమానం.

కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతో తరతరాల చరిత్రను కాలరాయడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ముఖ్యమంత్రి గారూ @TelanganaCMO—మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచినంత మాత్రాన సికింద్రాబాద్ పౌర అస్తిత్వాన్ని మీ ఇష్టానుసారం మార్చే హక్కు ఎవరికీ లేదు. మల్కాజిగిరి పేరుతో “ప్రత్యేక ఎంసిహెచ్” ఏర్పాటు చేసి, చారిత్రక సికింద్రాబాద్ సరిహద్దులను బలవంతంగా మింగేయడం ఏకపక్షం, హాస్యాస్పదం, నియంతృత్వ ధోరణికి నిదర్శనం.

ఇది ప్రజాస్వామ్య పాలన కాదు; ఇది అధికార దుర్వినియోగం. ప్రజలు ప్రేమించి, గర్వంగా జీవించిన చారిత్రక మూలాలను చెరిపేయాలన్న ప్రయత్నం. సికింద్రాబాద్ పేరు, సంస్కృతి, గుర్తింపును కాపాడాలి; గౌరవించాలి. దాని ఉనికిని దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా—ఇక్కడి ప్రజలే కాదు, చరిత్ర కూడా ప్రతిఘటిస్తుంది.
సికింద్రాబాద్ జోలికి రావొద్దు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *