మాదక పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు
తిమ్మాపూర్, పిబ్రవరి 17 (విశ్వం న్యూస్) : యువత మాదక పదార్థాలు, ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ఎక్కువ శాతం మంది యువత మాదక పదార్థాలు, ద్రవ్యా లను మొదట సరదాగా తీసుకుని తర్వాత బానిసలుగా మారుతున్నారని చెప్పారు. శుక్రవారంనాడు కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో “మాదక పదార్ధాలు వాటి దుష్పరిణామాలు” అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటైంది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ మాదక పదార్ధాలు సేవించిన మత్తులో యువత ఉన్మాదులుగా మారి హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నా రన్నారు. మాదక పదార్థాలకు బానిసలుగా మారినట్లయితే వారి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, సమాజంపై వారి ప్రభావం పడుతుందని తెలిపారు. జీవితాలను ఉజ్వలంగా తీర్చుదిద్దు కోవాల్సిన వయస్సులో ఎక్కువశాతం యువత మాదక పదార్ధాలు, ద్రవ్యాలకు బానిసలుగా మారడం వల్ల వారి జీవితాలు ఎందుకు పనిరాకుండా పోవడమే కాకుండా అభివృద్ధి కుంటుపడేందుకు కూడా కారణం అవుతున్నారని చెప్పారు. “డ్రగ్ ఫ్రీ” కరీంనగర్ లక్ష్యంతో పోలీస్ శాఖ కృషిచేస్తూ గంజాయి అక్రమ రవాణా, ఇతర మత్తుపదార్ధాలు పానీయాల నియంత్రణకు పకడ్భందీ చర్యలను తీసుకుంటు న్నదని, ఇందులో భాగంగా అక్రమ రవాణాల నియంత్రణ కోసం తనిఖీలు, దాడులను కొనసాగి స్తున్నదని పేర్కొన్నారు. యువతను సన్మార్గంలో పయనింపజేయాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. ” డ్రగ్ ఫ్రీ” కరీంనగర్ ఏర్పాటులో అన్నివర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు, ద్రవ్యాలను సేవించి పట్టుబడిన వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మాదక పదార్థాలు, ద్రవ్యాలు అక్రమ రవాణాలకు పాల్పడినా, విక్రయించినా వారిపై కేసులు నమోదు చేయడంతోటు హిస్టరీషీట్లను తెరువడం జరుగు తుందని స్పష్టం చేశారు. గంజాయితో పాటు ఇతర రకాల పదార్థాలు, ద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు ప్రోత్సాహకరంగా నగదు పారితోషికాన్ని అందజేస్తామని ప్రకటించారు. గంజాయి, ఇతర రకాల మత్తుపదార్ధాలకు విక్రయించిన, రవాణాకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా 20 మందిపై పీడీయాక్ట్ ను అమలు చేశామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్, రూరల్ ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఇన్స్ పెక్టర్లు లక్ష్మిబాబు, దామోదర్ రెడ్డి, పర్శ రమేష్, వైద్యులు కొమ్ము కిరణ్, సైకాల జిస్ట్, కౌన్సిలర్ డాక్టర్ గాలిపల్లి నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.