
- కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, జూలై 30 (విశ్వం న్యూస్) : రాష్ట్రం వరదలతో అతలాకుతలం అయిందని అన్నారు. వరద బాధితుల అర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తండ్రి కొడుకులు ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందని.. అందుకే ఈ ప్రభుత్వానికి వరద నీటిలో తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చచ్చిపోయారు కాబట్టి వారికి సోమవారం రోజున తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నానని అన్నారు.
కేసీఆర్ కి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని దుయ్యబట్టారు. వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలలో మునిగిపోయారని.. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి. మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసిన తప్పులేదని తీవ్ర విమర్శలు చేశారు.