బాల్యమితుల సేవా సమితి
ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఇల్లందకుంట, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : ఇల్లందకుంట దేవస్థానం జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి ఏర్పాటు కోసం ఈరోజు బాల్య మిత్రుల సేవాసమితి (1983- 84)) బ్యాచ్ జమ్మికుంట ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఎండల తీవ్రత దృష్ట జాతరకు వచ్చే భక్తులకు దాహర్థి తీర్చడం కోసం గత సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసాము.
అదే స్ఫూర్తితో, అదే సేవాభావంతో ఈ సంవత్సరం కూడా చలివేంద్రము ఏర్పాటు చేసినట్లు బాల్యమిత్రుల సేవా సమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం తెలిపారు. గత సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించినందుకు SI వీరికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ సంవత్సరం కూడా చలివేంద్రం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమములో స్థానిక ఎస్సై తోట తిరుపతి, మరియు బాల్య మిత్రుల సేవాసమితి కన్వీనర్ గుడిమిల్ల బలరాం ప్రతినిధులు M.సంపత్ రావు, B.సాంబయ్య, K.రాజేందర్, G.సురేందర్, Ch.సమ్మయ్య, A.సంపత్ కుమార్, V.ప్రకాష్, J. శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది మోహన్, రాజయ్య, రవి, పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు నవీన్ శర్మ పూజాకార్యక్రమాలు నిర్వహించారు.