ఘనంగా బాబు జగ్జీవన్ రామ్
116వ జయంతి వేడుకలు

కరీంనగర్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, గారు ఏఐసీసీ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు జడ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ , కవ్వంపల్లి సత్యనారాయణ గార్లు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాలను ఎంతో అభివృద్ధి చేశాడని నెహ్రూ , ఇందిరాగాంధీ గార్ల క్యాబినెట్లో కూడా పని చేసి అందరి మన్నలను పొందారని ఆయన కుమార్తె స్పీకర్ మీరా కుమారి నేతృత్వంలోనే తెలంగాణ బిల్ పాస్ అయిందని తనపై పెప్పర్ దాడి చేయాలనుకునే పరిస్థితుల్లో కూడా ఆ తల్లిని కాపాడుకోవడం జరిగిందని లోక సభలో చట్టరీత్యా తెలంగాణ బిల్ పాస్ సాధించుకునే విధంగా ఆమె సహకారం ఎంతో ఉపయోగపడిందని అన్నారు. ఆయన కుమార్తె అయినటువంటి అప్పటి స్పీకర్ మీరా కుమారి గారు తెలంగాణ రావడంలో ప్రధాన భూమిక పోషించినారని, జగ్జీవన్ రావు గారు ఓటమెరుగని నాయకుడని ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు.

అనంతరం నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గార్లతోపాటు పలువురు నాయకులు విగ్రహానికి పూల దండలు వేయడానికి వెళ్ళగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఫోటో కాల్ ప్రకారం కలెక్టర్, మంత్రి పూల దండలు వేసిన తర్వాతనే మిగతావారు వేయాలని పోలీసులు దురుసుగా సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు జగ్జీవన్ రామ్ జయంతి అధికార పార్టీ, ప్రభుత్వం ఉదయం 9:30 కు ప్రారంభిస్తామని చెప్పి 11:30 వరకు కలెక్టర్, మంత్రి రాకపోవడంతో అధికార పార్టీ వారు కావల్సుకొని లేటుగా రావడం జరిగిందని, ఇది చాలా అవమానకరమైనదని, ఇది చట్టరీత్యా నేరమని ఒక విధంగా చెప్పాలంటే బాబు జగ్జీవన్ రామ్ గారిని అవమానపరిచారని, కాంగ్రెస్ నాయకులు అసహనం చెంది విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. దీంతో టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల వైపు దూసుకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కర్రసత్య ప్రసన్న రెడ్డి, చర్ల పద్మ, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, వెన్న రాజ మల్లయ్య, మడుపు మోహన్, నాగి శేఖర్, మల్యాల సుజిత్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కల్వల రామ్ చందర్ ,విక్టర్, కాడే శంకర్ ,జీడి రమేష్ ,దండి రవీందర్, వంగల విద్యాసాగర్, రామిడి రాజిరెడ్డి, పోరండ్ల రమేష్, షాహిన్షా, షబానా మహమ్మద్, సత్యనారాయణ రెడ్డి, యనమల మంజుల, నాగుల సతీష్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, నదీమ్, ఆశిక్ పాషా, ఎస్ డి అజ్మత్, ముక్క భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.