ఈటలకు మద్దతు తెలిపిన
పాడి ఉదయనందన్ రెడ్డి
జమ్మికుంట నవంబర్ 25 విశ్వం న్యూస్: యఫ్ టీవి ఫౌండర్ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి మీడియా సమక్షంలో బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతూ….ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఈటల రాజేందర్ కు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా సమ్మక్క సారలమ్మ జాతర వివాదం, దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్కాలర్షిప్ పంపిణీని, అడ్డుకోవడంతోపాటు తనపై మొదటిసారిగా ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితులలో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. తనకు రాజకీయాలలోకి రావడం ఆసక్తి ఉన్నప్పటికీ తనపై ఉన్న బాధ్యతల దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని, అతి త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాడి ఉదయ నందన్ రెడ్డి తో పాటు ఉదయానంద్ రెడ్డి అభిమానులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.