Vishwam Newsకరీంనగర్

ప్రణవ్ కి ఆర్థిక సాయం అందించిన చిన్నారి

జమ్మికుంట, నవంబర్ 25 విశ్వం న్యూస్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంటలో ప్రచారం నిర్వహించగా ఈ సందర్భంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారుడు అన్నం ప్రవీణ్ కూతురు చిన్నారి అన్నం చరిత నేను సైతం అంటూ తన కిడ్డి బ్యాంకు ని ప్రణవ్ బాబుకి అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రచారం లో ఉన్న నాయకులందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ బాబు తో పాటు కాంగ్రెస్ నాయకులు మోలుగురి సదయ్య పొనగంటి మల్లయ్య అరుకాల వీరేశలింగం స్థానిక నాయకులు కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *