కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
హైదరాబాద్, జనవరి 21 (విశ్వం న్యూస్) : కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలి. బఫర్ వైద్య బృందాలతో వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు. కంటి వెలుగు క్యాంపులో ట్యాబ్ ఎంట్రీలు సమర్థవంతంగా జరగాలి. జిల్లాలో ఉన్న కళ్ళద్దాల స్టాక్ పై కలెక్టర్లు రెగ్యులర్ గా తెలుసుకోవాలి.