ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు యువకుల మృతి

- ప్రైవేట్ బస్సును ఢీకొన్న బైక్
వరంగల్, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్): వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొనడం తో నలుగురు యువకులు మృతి చెందారు.
ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతులు నలుగురు ఇల్లంద గ్రామానికి చెందినవారుగా తెలిసింది. కాశిమల్ల వరుణ్ తేజ, మల్లెమాక సిద్దు, గణేష్, పొన్నాల అనిల్ కుమార్ మృతుల్లో ఉన్నట్లు సమాచారం.