వరంగల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్) : వరంగల్ జిల్లాలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాజీపేట దర్గా ప్రాంతంలో అర్చన అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తన నివాసంలో చీరతో ఉరివేసుకుని జీవితం ముగించుకుంది. ఈ ఘటన పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అర్చన 2022లో వివాహం చేసుకుంది. అయితే కొద్ది రోజులకే ఆమెకు విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి ఆమె తీవ్ర మానసిక వేదనలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఆమె మనోవేదన మరింత పెరిగినట్లు సమాచారం.
ఇదే తరహాలో, ఇటీవల నీలిబండ తండాలో నీలిమ అనే మరో మహిళా కానిస్టేబుల్ కూడా పెళ్లి కుదరడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస సంఘటనలు పోలీసు వ్యవస్థలో మహిళలకు కలుగుతున్న ఒత్తిడిని, మానసిక ఆరోగ్యంపై ముప్పును చాటుతున్నాయి.
