ఆరె కులస్తులకు ఆర్థిక
సహాయాన్ని అందించాలి

ఇల్లంతకుంట, జూన్ 21 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం కులవృత్తుల వారికి లక్ష రూపాయాల ఆర్థిక సహాయం పథకాన్ని అమలు చేస్తున్న దానిలో భాగంగానే ఆరెకులస్తులైన పేదలకు అవకాశం కల్పించి, ఆరెలను ఆదుకోవాలని, ఆరె కులాన్ని బీసీ పథకంలో చేర్చాలని జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలలో 15 కులాలకు చెందిన పేద మరియు మధ్యతరగతి ప్రజలకి ఆర్థిక చేయూతనిచ్చే ఉద్దేశంతో లక్ష రూపాయల పథకాన్నిఇటీవల ప్రవేశపెట్టింది దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ జాబితాలో ఆరె కులం లేక పోవడం విచారించ దగిన విషయ. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు ఉన్న ఆరె కులాన్ని బీసీ లక్ష రూపాయల పథకంలో చేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సర కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే 1,50,000 పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల వరకు ఉన్న ఆరె కులస్థులు ఎక్కువ మంది ఉన్నారు.
ఆరె వాళ్ళు అక్షరాస్యతలో రాష్ట్ర సగటు కంటే తక్కువ, ఆరె కులస్థుల పనిగంటలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ, తలసరి ఆదాయం రాష్ట్ర సగటు కంటే తక్కువ, ప్రభుత్వ ఉద్యోగాల్లో నామమాత్రపు వాట, రాష్ట్ర సగటు కంటే తక్కువ భూమి కలిగి ఎక్కువ జనాభా వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో అధిక మంది ఆరె కులస్థులు ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆరె కులస్తుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి పునరాలోచన చేసి ప్రభుత్వ నిబంధనలకు అర్హులైన ఆరె కులస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకంలో చేర్చగలరని విన్నపం. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అదర్ సండి నాగేశ్వరరావు, తిప్పారపు బాపురావు, ప్రదానకార్యదర్శి బేoబిరి కిషన్ రావు, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఇంగిలే ప్రభాకర్, దిలీప్, ఆరె కులస్తులు పాల్గొన్నారు.