కోకాపేట్ నియో పోలీస్ లో అగ్ని ప్రమాదం
కోకాపేట్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్, జనవరి 3 (విశ్వం న్యూస్) : కోకాపేట్ నియో పోలీస్ లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో పడ్డారు.
గండిపేట్ మండల పరిధిలోని కోకాపేట్ నియో పోలీస్ లోని మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. షాక్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
