115 మందితో తొలి జాబితా-రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ పోటీ

హైదరాబాద్‌, ఆగస్టు 21 (విశ్వం న్యూస్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేసుగుర్రాలను ప్రకటించారు కేసీఆర్.. 115 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఎన్నికల కదనరంగంలో ముందంజలో నిలిచారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు.

ఈ సారి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండగా.. ఎప్పటిలాగే.. సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ యథావిధిగా పోటీ చేయనున్నారు.

బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు.

  • BRS ఫస్ట్ లిస్ట్ : అభ్యర్థులను మార్చిన సెగ్మెంట్లు ఇవే..
  • సీఎం కేసీఆర్ తొలిజాబితాను ఈ రోజు తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు ప్రకటించారు. వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, కామారెడ్డిలో అభ్యర్థులను మార్చారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కొడుకు సంజయ్‌ను బరిలో దింపనున్నారు.
  • వేముల వాడ – చలిమెడ లక్ష్మీ నరసింహారావు
  • స్టేషన్ ఘన్ పూర్ – కడియం శ్రీహరి
  • బోథ్ – అనిల్ జాదవ్
  • ఖానాపూర్ – భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్
  • ఆసిఫాబాద్ – కోవలక్ష్మీ
  • వైరా – మదన్ లాల్
  • కోరుట్ల – డాక్టర్ సంజయ్
  • ఉప్పల్ – బండారి లక్ష్మారెడ్డి
  • కామారెడ్డి – సీఎం కేసీఆర్ బరిలోకి దిగనున్నారు. ఈ స్థానాల్లో సిట్టింగ్‌లు తమ సీట్లను కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *