తెలంగాణహైదరాబాద్

జనం కోసం.. జనంలోకి

జనం కోసం.. జనంలోకి

  • పీర్జాదిగూడ కార్పొరేషన్ లో హాథ్ సే హాథ్ జోడోయాత్ర జోరు
  • పిఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో హాథ్ సే హాథ్ జోడోయాత్ర..
  • ముఖ్య అతిథులుగా అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్

పీర్జాది గూడ,పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ ఏరియాలోని 3,4,5 డివిజన్లలో ఈరోజు సాయంత్రం సాయి మహదేవ నగర్ లోని సాయిబాబా గుడి నుండి ప్రారంభమై గాంధీ విగ్రహం వరకు హాథ్ సే హాథ్ జోడోయాత్ర కోలాహలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రతి ఒక్కరికి వివరించి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరాన్ని ప్రజలకు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్ష, కార్యదర్శులు వేముల మహేష్ గౌడ్,కొత్త కిషోర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, దళిత విభాగం బీ బ్లాక్ అధ్యక్షులు కుర్రి మహేష్, పోచారం మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ముదిగొండ రమేష్, నాగేష్, నాదం గౌడ్, రంజిత్ రెడ్డి, ఐలేష్ యాదవ్, పవన్ గౌడ్, మోహన్, మజర్, ఉదయ్ రాజ్ గౌడ్, నాగరాజు, విజేందర్ రెడ్డి, బద్దం సాయిరాం రెడ్డి, ఘట్కేసర్ మండల నాయకులు మెట్టు రమేష్, బద్రి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *