బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

హైదరాబాద్, జనవరి 27 (విశ్వం న్యూస్) : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ శుక్రవారం సాయంత్రం భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ గారికి బీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తొమ్మిదిసార్లు ఎంపీగా, ఒకసారి ఒడిశా సీఎంగా గమాంగ్ :
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గిరిధర్‌ గమాంగ్‌కు ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానం ఉన్నది. గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాలంలో బీజేపీ తీరు నచ్చక గిరిధ‌ర్ గమాంగ్ తోపాటు, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. నేడు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *