Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

ఖమ్మంలో రెండోవిడత కంటి వెలుగును ప్రారంభించిన నలుగురు సీఎంలు

ఖమ్మంలో రెండోవిడత కంటి వెలుగును ప్రారంభించిన నలుగురు సీఎంలు

హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులు ధరవాత్‌ బిచ్చమ్మ, మందా అన్నపూర్ణ, రామనాథం, కోలం జ్యోతి, వెంకటేశ్వర్లు, షేక్‌ గౌసియా బేగం తదితరులకు నేతలు సీఎంలు కేసీఆర్, పినరయి విజనయ్‌, అరవింద్‌ కేజ్రీవాల్ భగవంత్‌ మాన్‌లతో పాటు, అఖిలేశ్‌ యాదవ్‌, డీ.రాజా కంటి అద్దాలను అందజేశారు. కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ తో పాటు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *