పదవ తరగతి పరీక్ష కేంద్రాలను
తనిఖీ చేసిన గరీమా అగర్వాల్
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : పదవ తరగతి పరీక్షల కేంద్రాలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని కార్ఖనగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఓల్డ్ హైస్కూల్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, ఇన్విజిలేటర్లు పగడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తో లోకి అనుమతించ వద్దని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు.