‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి’ (బి.ఆర్.ఎస్)
రచించిన వనం జ్వాలా నరసింహారావు
హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : జాతీయ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గత ఐదు సంవత్సరాలుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా రూపొందించిన ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి(బి.ఆర్.ఎస్)’ తొలి ఆంగ్ల పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రచించిన ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రచయితను, ప్రచురణకర్తను అభినందించారు.