రాజ్యాంగ గ్రంధాన్నిఇంటింటికీ ఇవ్వండి

ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్
జమ్మికుంట, మే 9 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు ఇంటింటికీ ఒక రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా ఇవ్వాలని అది ప్రభుత్వాల విధిగా భావించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు రాజ్యాంగ గ్రంధం పట్ల అవగాహన లేకపోవడం వలన చైతన్య వంతుల కాలేక హక్కులు కోల్పోతున్నారని వాపోయారు. ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ ఆదేశాల మేరకు ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు జమ్మికుంట తహశీల్దార్ కు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ సభ్యులు రవితేజ, సందీప్, మహేష్, రవి కుమార్, సతీష్, సాగర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.