బిఆర్ఎస్ గ్రామ, మండల, అనుబంధ కమిటీలు 16 వరకు ఎన్నిక
బిఆర్ఎస్ గ్రామ, మండల, అనుబంధ కమిటీలు 16 వరకు ఎన్నిక

శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట, మే 9 (విశ్వం న్యూస్) : వచ్చే ఎన్నికలలో ప్రతి కార్యకర్త ఒక ఎం.ఎల్.ఏగా భావించి హుజురాబాద్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగురవేసి కె.సి.అర్ కు కానుకగా ఇద్దాం అని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంత కుంట, కమలాపూర్, వీనవంక మండలాలను ఉద్దేశించి ప్రసంగించారు.
అందరం కె.సి.అర్ గ్రూప్ లో ఉన్నాయని ఎటువంటి గ్రూపులకు ఆస్కారం లేకుండా ఉండాలని హితవు చెప్పారు. ఈ నెల 16 తేదీ వరకు అన్ని మండలాలలోని గ్రామ, మండల, అనుబంధ శాఖల
కమిటీలు పూర్తి అవుతాయని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణా రావు అనుమతితోమండల కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ఇతర పార్టీల నాయకులు మన పార్టీని విమర్శించినపుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అలాగే జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధి లు, నియోజక వర్గ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికపుడు ఖండించాలన్నారు.
గ్రామ, అనుబంధ కమిటీలను నియమించేందుకు పార్టీ ఆదేశానుసారం ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కె.డి.సి.సి వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణ రావుల సమక్షంలో ఏర్పాటు చేస్తారని తెలిపారు.
అంతిమంగా నా లక్ష్యం ఒకటే హుజురాబాద్ గడ్డపై బి.అర్.ఎస్. జెండా ఎగురవేసి కె.సి.అర్ కు కానుకగా ఇవ్వటమే అని తెలిపారు.
