గౌడ కుల బాందవులకు శుభవార్త

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : స్థానిక సప్తగిరి కాలనీలో వివిధ కుల సంఘాల భవన నిర్మాణ ప్రారంభోత్సవం కోసం విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని కలిసి అన్ని కుల సంఘాలకు మీరు స్థలాలు కేటాయిస్తున్నారు. పట్టణంలో పెద్ద కుల సంఘాలలో ఒకటైన మా గౌడ కుల సంఘానికి కూడా స్థలం కేటాయించాలని కోరగా వెంటనే స్పందించి కుల సంఘాలకు కేటాయించిన స్థలాల పక్కనే స్థానిక సప్తగిరి కాలనీలో రెండున్నర గుంటల స్థలాన్ని మన గౌడ కుల సంఘానికి కేటాయించిన మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

స్థలం కేటాయింపు గురించి మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లిన యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, నాగుల కిరణ్ గౌడ్ లకు కరీంనగర్ గౌడ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మాణ పనులు అతి తొందరలో ప్రారంభిస్తామని మంత్రివర్యులు తెలియజేశారు. స్థల కేటాయింపు కోసం ప్రత్యేక చొరవ తీసుకొన్న స్థానిక కార్పొరేటర్ దిండిగాల మహేష్ కి, బోనాల శ్రీకాంత్ కి, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదములు.