కూలి రేట్లు పెంచాలి

హమాలీ కార్మికుల ఆవేదన
సిఐటి యూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్
వీణవంక, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : వీణవంక మండల పరిధిలోని అన్ని గ్రామాల హమాలీ పెద్ద మనుషులతో ఆదివారం రోజున బీరన్న దేవస్థానం ఆవరణలో జనరల్ బాడీ సమావేశం మరి రవి అధ్యక్షతన నిర్వహించారు. మండల హమాలీ కార్మికుల కూలిరెట్ల సీడ్స్ అండ్ బజార్ ఐకెపి.ఒప్పందం రెండు సంవత్సరాల కాలపరిమితి ముగిసినందున వెంటనే నూతన కూలీ రేట్ల ఒప్పందం చేయాలని హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పిల్లి రవి యాదవ్ డిమాండ్ చేశారు.
ఐకెపి సెంటర్లో కనీస సౌకర్యాలైన మంచినీటి సదుపాయం టెంటు, సౌకర్యం కార్మికులకు కల్పించాలని, ప్రతి అమాలి కార్మికుడికి ఎమ్మార్వో ద్వారా గుర్తింపు కార్డులు అలాగే కార్మికులందరికీ పిఎఫ్ ,ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హామాలి కార్మికులకు వర్తించే విధంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని, ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల హమలి యూనియన్ నాయకులు తడిగొప్పుల్ రాజయ్య, గుంపుల సంపత్, ఎం శంకర్, ఎం రవి, బండి ఐలయ్య, రాజమల్లు, రాజ్వీర్, రాజు, కొమరయ్య, రవి శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.