నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నాందేడ్, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈనెల 5న తేదీన నిర్వహించనున్న బీఆర్‌ఎస్ పార్టీ సభ ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు గారు, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్ గారు, నాందేడ్ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈరోజు పర్యవేక్షించారు.