గవర్నర్ గారు మాకు
న్యాయం చేయండి
హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. గౌరవ తెలంగాణ గవర్నర్ గారు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలి: బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్
”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగాణ గవర్నర్ గారు అమలు చేసి పేదకులాలు చెందిన తమకు న్యాయం చేయాలి” అని కోరారు బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో 31 జూలై 2023న మంత్రి మండలి చేసిన నామినేషను అమలు చేయాలని కోరుతూ డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, గవర్నర్ కు వినతి పత్రం అందించారు.
అనంతరం మీడియాతో డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 31, జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నామినేట్ చేస్తూ తీర్మానం చేసింది. దాదాపు యాబై రోజుల తర్వాత సెప్టెంబర్ 25న గవర్నర్ గారు మా నామినేషన్ ని తిరస్కరించారు. 07, 12, 23 దీనిపై మేము కోర్టులో కేసు వేశాం. వాదోపవాదాలు జరుగుతున్న నేపధ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం 27, 1, 2024న ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ అదే రోజు ఆమోదం తెలుపుతూ గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నిటిని పరిశీలించిన హైకోర్టు మూడు ప్రధాన సూత్రలని తీర్పుగా ఇచ్చింది. మా నియామకాలని తిరస్కరించిన గవర్నర్ నిర్ణయం తప్పని చెబుతూ గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేసింది.
ప్రో కోదండరాం, అమీర్ ఆలీ ఖాన్ నియామకం చట్టవిరుద్ధమని, వారి నియామకం కూడా రద్దు చేసింది. అలాగే మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారు తప్పని సరిగా అమలు చేయాలనే ప్రాధమిక మూల సూత్రాన్ని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీంతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది” అని పేర్కొన్నారు.
‘మేము పేద కులాలకు చెందిన వారము. వ్యాపారపరమైనటు వంటి రాజకీయాలో పేద కులాలకు చెందిన మాలాంటి వరకు అవకాశాలు రావు. ఇది మాకు గొప్ప అవకాశం. నేను పీ హెచ్డీ చదువుకున్నాను. ఎంబీఎ, యంఏ, ఎల్ఎల్ బి చేశాను. ఉస్మానియా యూనివర్సిసిటీలో ప్రోఫెసర్ గా పని చేశాను. ప్రజా ఉద్యమంలో వున్నాను. విద్యార్ధి ఉద్యమాల్లో వున్నాను. ఏబీవీపీలో పని చేశాను. వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్ లో పని చేశాను. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో లక్షల జీతాన్ని వదిలి రాజకీయల్లోకి వచ్చాను. గత పదహారేళ్ళుగా ప్రజల గొంతుకై వున్నాను. నక్సల్ తో చర్చలు జరిపితేనే హింసకు చరమగీతం పాడినట్లు అవుతుందనే సూత్రంతో కుబుసం అనే చిత్రాన్ని నిర్మించాను. అందులోని పల్లెకన్నీరు పెడుతుందో పాట ప్రజలని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ పాటే 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇటు సామాజిక రంగం, కళారంగం, అటు సేవారంగంలో విశేషమైన కృషి చేశాను” అని పేర్కొన్నారు.
‘రాజ్యంగబద్ధంగా జూలై 2023న మంత్రి మండలి మమ్మల్ని ఎమ్మెల్సీ గా నియామకం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు మేము అర్హులం. అలాగే ఆర్టికల్ 191 ప్రకారం ఎటువంటి అనర్హత( Disqualifications )కూడా మాకు వర్తించదు. కాబట్టి గవర్నర్ గారు మమ్మల్ని పరిగణించాలి. తల్లిలాంటి గవర్నర్ గారు రాజ్యాంగాన్ని, మాలాంటి పేదవారిని కాపాడాలి. మాకు న్యాయం చేయాలి. కౌన్సిల్ కి వెళ్ళడానికి అన్ని అన్ని అర్హతలు వున్నాయి. కోర్టు వారు అన్ని విషయాలు పరిశీలించి తర్వాత ఇచ్చిన తీర్పుని గవర్నర్ గారు అమలు చేసి మాకు న్యాయం చేసి మా వర్గాలకు ప్రతినిధిగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి’ అని చేతులు జోడించి నమస్కరించారు దాసోజు.