ప్రభుత్వం 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి : ఈటల డిమాండ్

ప్రభుత్వం 50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి : ఈటల డిమాండ్

వీణవంక, మార్చి 22 (విశ్వం న్యూస్) : ఈ రోజు హిమ్మత్ నగర్ గ్రామంలో వడగండ్ల వానకు నష్టపోయిన రైతుల పంటలను మరియు ఇళ్లను సందర్శించిన ఈటల రాజేందర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘువరన్ లాంటి యువకులు పీజీలు చేసిన ఉద్యోగాలు రాక గత్యంతరం లేక కౌలుకు తీసుకుని నాలుగు ఎకరాలలో మొక్క జొన్న సాగుకు లక్షల పెట్టుబడులు పెట్టీ సాగు చేయగా వడగండ్ల వానకు పూర్తిగా నష్ట పోయిన పంటలను చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగాయని ఈటల వాపోయారు. కేంద్ర ప్రభుత్వం పసల్ భీమా పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఈ రోజు నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందటం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 50 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపి నాయకులూ, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *