శ్రీ అభయాంజనేయ స్వామి
దేవాలయంలో వైభవంగా
మహాశివరాత్రి వేడుకలు

- భక్తి శ్రద్ధలతో మహా శివరాత్రి
- మార్మోగిన శివనామస్మరణ

బండ్లగూడ జాగిర్, ఫిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డులో గంధంగూడ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆలయ ధర్మకర్త శ్రీ రాజగోపాలచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోరిన కోర్కెలు తీర్చుతూ.. భక్తులకు కొంగుబంగారాన్ని అందిస్తున్న మహాశివుడిని హర హర మహాదేవ.. అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సేవాదళ్ మరియు భక్తులు విశేషంగా పాల్గొన్నారు.