మోతీ నగర్లో రాయల్ గార్డెన్ వద్ద “రాయల్ దర్బార్” దాబా ఘనంగా ప్రారంభోత్సవం

ఘనంగా “రాయల్ దర్బార్”
దాబా ప్రారంభోత్సవం

హైదరాబాద్, డిసెంబర్ 14 (విశ్వం న్యూస్) : హోటల్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన మిస్టర్ గూడూరి నరేందర్ రెడ్డి, గతంలో ‘తందూరి నైట్స్ డాబా” ద్వారా రుచి, నాణ్యత పరంగా కస్టమర్ల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు, అదే అభిరుచి, నైపుణ్యంతో “రాయల్ దర్బార్” పేరుతో మోతీ నగర్ లోని రాయల్ గార్డెన్ ప్రాంగణంలో దాబాను స్థాపించారు. ఈ దాబా ప్రారంభోత్సవ కార్యక్రమం డాక్టర్ గూడూరి చెన్నారెడ్డి, IPC రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాయల్ గార్డెన్ అధినేత చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ప్రారంభోత్సవంలో మిస్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈరోజు యాంత్రిక జీవనశైలి వల్ల ప్రజలు తమ ఇంటి వంటపై సరిపడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో, ఆరోగ్యకరమైన, క్వాలిటీ ఫుడ్ అందించే రెస్టారెంట్లు కీలకంగా మారాయి. కస్టమర్ల సంతృప్తి మా ప్రాథమిక లక్ష్యం. మా మాస్టర్లతో పాటు సిబ్బంది అందరూ పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన సేవ అందించడానికి కట్టుబడి ఉంటారు” అని తెలియజేశారు. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కూడా తమ బాధ్యతను పునరుద్ఘాటిస్తూ, కస్టమర్ల అవసరాలకు తగిన రీతిలో సేవలందించేందుకు సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.

స్థానికులు, మరియు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ అతిథులు డాక్టర్ బి.కె విజయలక్ష్మి, చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి-DSP, చింతపల్లి సాయి కనిష్క రెడ్డి, జి.నందిని రెడ్డి, జి.షణ్ముఖ రెడ్డి, జి.శ్రీధర్ రెడ్డి, జి లేఖ రాజ్ రెడ్డి, జి.కళ్యాణ్ రెడ్డి, మాస్టర్ డాన్సర్ జి.వన్ రాజ్ రెడ్డి, మరియు ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులు వి ప్రవీణ్ రెడ్డి, ఏ బి రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఓపెనింగ్ అనంతరం జరిగిన డిన్నర్ కార్యక్రమంలో అందరూ వడ్డించిన వంటకాలను ఆరగించి, రుచిని ప్రశంసించారు. “రాయల్ దర్బార్” కస్టమర్లకు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందించాలని ఈ సందర్భంగా మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

అందరికీ ఆహ్వానం. ఒకసారి సందర్శించి, రాయల్ దర్బార్ ప్రత్యేకతను ఆస్వాదించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *