డైట్, కాస్మటిక్ చార్జీల పెంపుపై విద్యార్థుల హర్షం
డైట్, కాస్మటిక్ చార్జీల
పెంపుపై విద్యార్థుల హర్షం

హైదరాబాద్, డిసెంబర్ 14 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు డైట్ రేట్లు పెంచినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా స్పెషల్ సెక్రటరీ ఇఫ్తికార్ ఇక్బాల్, మేయర్ లతా ప్రేమ్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, సెక్రటరీ యూసుఫ్ అలీ, ఎంఈఓ విజయకుమార్, బీజేఎంసీ డీఈ యాదయ్య గార్లు పాల్గొన్నారు.



